ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఈ హీరోకి ఆ కథ బాగా నచ్చిందట!

Mon, Nov 09, 2015
కల్యాణ్ రామ్
కల్యాణ్ రామ్
ఏ సినిమాకైనా కథ ప్రాణం .. అందుకే కథ విషయంలో కథానాయకులు పూర్తి శ్రద్ధ పెడుతుంటారు. కథ నచ్చడమే ఆలస్యం దానిని సాధ్యమైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ఆతృత పడుతుంటారు. ప్రస్తుతం కల్యాణ్ రామ్ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడట. తాజాగా ఆయనకి ఒక కథ నచ్చడంతో, ఆ కథని వినిపించిన ఎ.ఎస్.రవికుమార్ చౌదరికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ కథ కల్యాణ్ రామ్ కి బాగా నచ్చేసిందనీ .. దానిపై ఆయన మంచి నమ్మకంతో ఉన్నాడని అంటున్నారు.

ఎ.ఎస్.రవికుమార్ చౌదరికి 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమా మంచి హిట్ ను ఇచ్చింది. ఈ సినిమా తరువాత ఆయన గోపీచంద్ - రెజీనా నాయకా నాయికలుగా 'సౌఖ్యం' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై కూడా ఆడియన్స్ లో ఆసక్తి వుంది. డిసెంబర్ 25న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ వెంటనే దిల్ రాజు నిర్మాణంలో రవికుమార్ చౌదరి - కల్యాణ్ రామ్ కాంబినేషన్లోని సినిమా సెట్స్ పైకి వెళుతుందట.
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)