ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పూరీ మార్క్ చూపించాడు!

Mon, Nov 09, 2015
వరుణ్ తేజ్ కథానాయకుడిగా 'లోఫర్' ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ఈ ఫస్టులుక్ కి అనూహ్యమైన స్పందన రాగానే, తాజాగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఫస్టులుక్ పోస్టర్స్ లో మదర్ సెంటిమెంట్ .. లవ్ .. యాక్షన్ అంశాలను ఎంచుకున్న పూరీ, ట్రైలర్ విషయంలోనూ అంతే జాగ్రత్త తీసుకున్నాడు.

ఎలాంటి పరిస్థితుల్లో కథానాయకుడు పుట్టి పెరిగాడు .. అతనిపై తండ్రి ప్రభావం ఎలా పడిందనే విషయం ఈ ట్రైలర్ ద్వారా స్పష్టం చేశాడు. ''నేను పుట్టిందే నొక్కేయడానికి .. మధ్యలో ఆపేస్తే తొక్కేస్తా'' అంటూ కథానాయకుడు చెప్పే డైలాగ్ .. పూరీ మార్క్ ను గుర్తుచేస్తుంది. కథానాయికను హీరో ఆటపట్టించడం .. హీరో గొడవలకి దిగడం .. అతని మాట తీరు యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. మొత్తం మీద సినిమాలోని భారీతనాన్ని ఈ ట్రైలర్ ద్వారా ఆవిష్కరించడంలో పూరీ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది మరి.
X

Feedback Form

Your IP address: 54.211.11.50
Movie News (Latest)