ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'చోటా రాజన్' పాత్రలో అభిషేక్

Sun, Nov 08, 2015
అభిషేక్
అభిషేక్
దేశంలో ఏదైనా సంచలనమైన సంఘటన జరిగితే బాలీవుడ్ వెంటనే దానిని తెరకెక్కించే ప్రయత్నం చేస్తుంది. తాజాగా అలాంటి ప్రయత్నమే జరుగుతోంది. ఇటీవల ప్రముఖంగా వార్తల్లో నిలిచిన ముంబయ్ అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ జీవిత కథను తెరకెక్కించడానికి బాలీవుడ్ లో సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో చోటా రాజన్ పాత్రను అభిషేక్ బచ్చన్ పోషించనున్నాడు. ఎన్.హుస్సేన్ జైదీ రాసిన 'బైకుల్లా టు బ్యాంకాక్' అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించడానికి దర్శకుడు సంజయ్ గుప్తా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు చెబుతున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)