ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రౌడీకి లవర్ గా నయనతార!

Sat, Nov 07, 2015
నయనతార
నయనతార
జీవా కథానాయకుడిగా తమిళ్లో 'తిరుణాల్' అనే సినిమా రూపొందుతోంది. ఇందులో రౌడీగా జీవా .. అతని లవర్ గా నయనతార కనిపిస్తారట. తమిళ కథానాయకులలో జీవాకి మంచి పేరుంది. కొత్తదనం కలిగిన పాత్రల వైపే ఆయన మొగ్గు చూపుతూ ఉంటాడు. ఈ సినిమాలో`ఆయన రౌడీయిజం చెలాయిస్తూ, సందర్భాన్ని బట్టి నోట్లో నుంచి 'బ్లేడ్' బయటికి తీస్తూ ఉంటాడట. అందువలన అందరూ అతణ్ణి బ్లేడ్ అని పిలుస్తూ ఉంటారు.

అతని లవర్ గా లంగా .. ఓణీలో నయనతార దర్శనమిస్తుంది. ఒకానొక సందర్భంలో ఆమె కూడా తన లవర్ స్టైల్లో నోట్లో నుంచి బ్లేడ్ బయటికి తీస్తుందని అంటున్నారు. ఇలా మాస్ పాత్రలో నయనతారను తెరపై చూడటానికి ఆమె అభిమానులంతా ఆతృత పడుతున్నారు. రామనాథన్ దర్శకత్వంలో సెంథిల్ కుమార్ నిర్మిస్తోన్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
X

Feedback Form

Your IP address: 54.147.211.117
Movie News (Latest)