ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హిందీ రీమేక్ దిశగా 'శ్రీమంతుడు'

Fri, Nov 06, 2015
'శ్రీమంతుడు' లో ఓ దృశ్యం
'శ్రీమంతుడు' లో ఓ దృశ్యం
తెలుగు, తమిళ భాషల్లో హిట్ కొట్టిన చిత్రాలను రీమేక్ చేయడానికి బాలీవుడ్ కథానాయకులు ఆసక్తిని చూపుతుంటారు. వాళ్లు చూపించే ఉత్సాహం కారణంగానే దర్శక నిర్మాతలు రంగంలోకి దిగుతుంటారు. ఈమధ్య కాలంలో తెలుగులో అనూహ్యమైన విజయాన్ని సాధించిన చిత్రాల్లో 'శ్రీమంతుడు' ముందువరుసలో కనిపిస్తుంది. ఈ సినిమా రైట్స్ దర్శకుడు కొరటాల శివ దగ్గర వున్నాయి.

ఆయన నుంచి రీమేక్ రైట్స్ తీసుకోవడానికి బాలీవుడ్ దర్శక నిర్మాతలు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారట. వాళ్లతో కొరటాల శివ చర్చలు జరుపుతున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ లావాదేవీలు ఒక కొలిక్కి రావొచ్చని అంటున్నారు. ఈ సినిమాను హిందీలో చేయడానికి సల్మాన్ ఖాన్ ఉత్సాహాన్ని చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక హృతిక్ రోషన్ కూడా ఆసక్తిని చూపిస్తున్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రీమేక్ రైట్స్ తీసుకునే దర్శక నిర్మాతలు ఈ సినిమాను ఎవరితో మొదలుపెడతారనేది ఆసక్తికరంగా మారింది.
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)