ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'కబాలి' అలా చెలరేగుతాడట!

Thu, Nov 05, 2015
రజనీకాంత్ కథానాయకుడిగా రంజిత్ తెరకెక్కిస్తోన్న 'కబాలి' సినిమా కోసం ఆయన అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రజనీ మాఫియా డాన్ గా కనిపించనున్నాడు. అయితే కూతురు పట్ల రజనీకి గల సెంటిమెంట్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనే వార్త తాజాగా కోలీవుడ్లో వినిపిస్తోంది.

గతంలో మాఫియా డాన్ గా వ్యవహరించిన కథానాయకుడు, అ తరువాత ఆ కార్యకలాపాలకి స్వస్తి చెప్పి సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటాడట. ఆ నేపథ్యంలో శత్రువులు ఆయన కూతురును కిడ్నాప్ చేస్తే, ఆ అమ్మాయిని విడిపించుకుని రావడానికి మళ్లీ ఆయన మాఫియా డాన్ గా మారడం జరుగుతుందని అంటున్నారు. 'చీకటి రాజ్యం'లో కిడ్నాపర్ల నుంచి కమల్ తన కొడుకును విడిపించుకు రావడానికి సిద్ధపడితే, 'కబాలి'లో రజనీ తన కూతురును విడిపించుకు రావడానికి రంగంలోకి దిగుతాడన్న మాట!
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)