ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

టాలీవుడ్ లో మల్లూ బేబీ హవా!

Wed, Nov 04, 2015
అనుపమ పరమేశ్వరన్
అనుపమ పరమేశ్వరన్
అనుపమ పరమేశ్వరన్ .. ఇప్పుడు ఈ అమ్మాయికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మలయాళంలో ఈ అమ్మాయి చేసిన 'ప్రేమమ్' సినిమా అక్కడ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. దాంతో ఈ అమ్మాయికి మలయాళంలోను .. తమిళ్లోను ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక 'ప్రేమమ్' తెలుగు రీమేక్ (మజ్ను) కోసం ఈ అమ్మాయిని పిలిపిస్తే, ఆ సినిమా ఛాన్స్ తో పాటుగా, 'అ .. ఆ' .. 'ఎవడో ఒకడు' సినిమాల్లోను అవకాశాలు దక్కించుకుంది.

వీటిలో నితిన్ కు జోడీగా అనుపమ చేస్తోన్న 'అ .. ఆ' సినిమా ఫిబ్రవరి 14న విడుదలవుతుంది. ఇక నాగచైతన్య సరసన అనుపమ చేస్తోన్న 'మజ్ను' మార్చ్ లో గానీ ఏప్రిల్ లో గాని రిలీజ్ కానుంది. రవితేజతో ఆమె నటిస్తోన్న 'ఎవడో ఒకడు' మే నెలలో విడుదల అవుతుంది. ఈ మూడు సినిమాలు చాలా తక్కువ గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాలతో అనుపమ హవా మొదలుకావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Movie News (Latest)