ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'సరైనోడు' రిలీజ్ అప్పుడే!

Wed, Nov 04, 2015
అల్లు అర్జున్
అల్లు అర్జున్
బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా 'సరైనోడు' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 8న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది. రకుల్ ప్రీత్ కథానాయికగా అలరించనున్న ఈ సినిమాలో, అల్లు అర్జున్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.

బన్నీ స్టైల్ కి తగిన డాన్సులు .. బోయపాటి మార్క్ కి తగిన ఫైట్లు ఫుల్ గా ఉంటాయని చెబుతున్నారు. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 8న ఈ సినిమాను విడుదల చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు ఆ డేట్ ను లాక్ చేసినట్టుగా సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
X

Feedback Form

Your IP address: 54.147.212.136
Movie News (Latest)