ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ప్రియమణితో డ్యాన్స్ చేస్తాడట!

Wed, Nov 04, 2015
ప్రియమణి
ప్రియమణి
షారుఖ్ ఖాన్ పిలవాలే గాని క్షణాల్లో ఆయన దగ్గర వాలిపోతానని అంటోంది ప్రియమణి. ఆమెతో కలిసి మళ్లీ డాన్స్ చేయాలని ఉందని షారుఖ్ అన్నప్పుడు, అందుకు ఎప్పుడు పిలిచినా క్షణాల్లో వచ్చేస్తానని ఆమె సమాధానం ఇచ్చింది. షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ప్రియమణి తన ట్విట్టర్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది.

గతంలో షారుఖ్ ఖాన్ తో కలిసి ప్రియమణి 'చెన్నై ఎక్స్ ప్రెస్'చిత్రంలో ఒక ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ఆ విషయాన్ని షారుఖ్ ఆమెకి గుర్తుచేస్తూ, మళ్లీ ఆమెతో కలిసి డాన్స్ చేయాలని ఉందని రిప్లై ఇచ్చాడు. ఈ విషయంలో ఆయన ఎప్పుడు కబురు చేసినా క్షణాల్లో వచ్చి వాలిపోతానని ప్రియమణి సంతోషంగా సమాధానం ఇచ్చింది. ప్రియమణి ఉత్సాహం చూస్తుంటే, మళ్లీ షారుఖ్ తో కలిసి ఏదో ఒక సినిమాలో మెరిసేలానే వుంది.
X

Feedback Form

Your IP address: 54.205.43.70
Movie News (Latest)