ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బాలీవుడ్ మూవీలో అఖిల్ హీరోయిన్!

Tue, Nov 03, 2015
సయేషా సైగల్
సయేషా సైగల్
'అఖిల్' సినిమాలో నాయికగా నటించిన సయేషా సైగల్, తన రెండవ సినిమాను హిందీలో చేసేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అఖిల్ మొదటి సినిమా కావడంతో కొత్త కథానాయిక కోసం భారీస్థాయిలో అన్వేషించారు. అలనాటి బాలీవుడ్ అగ్రకథానాయకుడు దిలీప్ కుమార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సయేషా సైగల్ ను ఎంపిక చేశారు.

ఈ సినిమా దీపావళి సందర్భంగా విడుదలకి ముస్తాబవుతోంది. ఇక హిందీలో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వారు అజయ్ దేవగణ్ కథానాయకుడిగా ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ఆయనే దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. 'శివాయ్' పేరుతో రూపొందనున్న ఈ సినిమా కోసం సయేషాను ఎంపిక చేశారు. ఇక ఈ సినిమాతో సయేషా కెరియర్ ఊపందుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)