ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'మజ్ను'లో మరో యంగ్ హీరో!

Tue, Nov 03, 2015
నితిన్
నితిన్
నాగచైతన్య హీరోగా 'మజ్ను' సినిమా తెరకెక్కడానికి అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఒక అతిథి పాత్ర కోసం హీరో నితిన్ ను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే నిజమైతే నితిన్ కాదనే అవకాశం కూడా చాలా తక్కువని చెప్పుకుంటున్నారు. మలయాళలో 'ప్రేమమ్' అనే చిత్రం అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాను 'మజ్ను' పేరుతో తెలుగులో చందూ మొండేటి రీమేక్ చేస్తున్నాడు.

'ప్రేమమ్'లో కథానాయికగా చేసిన అనుపమా పరమేశ్వరన్ నే తెలుగులోనూ తీసుకున్నారు. ఈ సినిమాలో రెండు ముఖ్యమైన అతిథి పాత్రలు ఉండగా, ఒక పాత్రలో నాగార్జున గానీ .. వెంకటేష్ గాని నటిస్తారట. రెండో పాత్ర కోసం నితిన్ ని అడుగుతున్నారట. అక్కినేని ఫ్యామిలీతో వున్న సాన్నిహిత్యం కారణంగా నితిన్ చేయడం ఖాయమని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల నుంది.
X

Feedback Form

Your IP address: 54.205.8.87
Movie News (Latest)