ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ సినిమాకి విలన్ ఖరారు!

Mon, Nov 02, 2015
అరవింద్ స్వామి
అరవింద్ స్వామి
చరణ్ కథానాయకుడిగా 'తని ఒరువన్' రీమేక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ గా అరవింద్ స్వామిని ఖరారు చేసినట్టుగా సమాచారం. ఈ మధ్య కాలంలో తమిళ్లో అఖండ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో 'తని ఒరువన్' ముందువరుసలో కనిపిస్తుంది. ఈ సినిమాలో కూల్ విలన్ గా అరవింద్ స్వామి నటించి, శభాష్ అనిపించుకున్నాడు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్.వి.ఎస్ ప్రసాద్ - అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో విలన్ పాత్రలకి చాలామందిని అనుకున్నప్పటికీ, అరవింద్ స్వామి అయితేనే బాగుంటుందని భావించి, చివరికి ఆయననే ఒప్పించారు. అరవింద్ స్వామి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తేలికగా ఊపిరి పీల్చుకున్న దర్శక నిర్మాతలు, జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారట.
X

Feedback Form

Your IP address: 54.197.90.95
Movie News (Latest)