ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ కోసం వాళ్లిద్దరూ పోటీ!

Mon, Nov 02, 2015
మహేశ్ బాబు
మహేశ్ బాబు
మహేశ్ బాబుతో సినిమా చేయాలని దర్శక నిర్మాతలు .. కథానాయికలు పోటీపడుతుంటారు. ఇక తాజాగా సంగీత దర్శకులు కూడా పోటీపడుతున్నట్టు తెలుస్తోంది. అలా పోటీపడుతోన్న సంగీత దర్శకుల జాబితాలో హారీస్ జయరాజ్ .. అనిరుధ్ పేర్లు వినిపిస్తున్నాయి. మహేశ్ కథానాయకుడిగా మురుగదాస్ ఒక సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు హారీస్ జయరాజ్ అయితే బాగుంటుందని ఆయన భావిస్తున్నాడట.

అయితే నిర్మాతలు మాత్రం అనిరుధ్ వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం హారీస్ జయరాజ్ కన్నా అనిరుధ్ కి క్రేజ్ ఎక్కువగా ఉందనీ, హారీస్ జయరాజ్ కంటే అనిరుధ్ తీసుకునే పారితోషికం కూడా తక్కువని అంటున్నారట. తెలుగు .. తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమా చేయాలని ఇద్దరు సంగీత దర్శకులు ఆసక్తిని చూపిస్తున్నారు. మరిక అవకాశం ఎవరిని వరించనుందనేది చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.147.211.117
Movie News (Latest)