ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తెలుగు ప్రేక్షకుల ముందుకు ఐశ్వర్యరాయ్!

Sat, Oct 31, 2015
ఐశ్వర్యరాయ్
ఐశ్వర్యరాయ్
ఐశ్వర్యరాయ్ .. అందమైన అభినయానికి ఈ పేరు చిరునామాగా కనిపిస్తుంది. ఐశ్వర్యరాయ్ వుంటే చాలు .. అది స్ట్రెయిట్ సినిమానా .. అనువాదమా? అనే ఆలోచన కూడా చేయకుండా ఆమె అభిమానులు ఆసక్తిని చూపుతుంటారు. అందువలన హిందీలోనే కాదు, తెలుగు .. తమిళ భాషలలోను ఆమె సినిమాలకి ఆదరణ లభిస్తూ వుంటుంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె నటించిన 'జజ్బా' చిత్రాన్ని 'అడ్వకేట్ అనురాధ వర్మ' పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. దాదాపు అయిదేళ్ల తరువాత ఆమె నటించిన ఈ సినిమాను సంజయ్ గుప్తా తెరకెక్కించాడు. ఈ నెల 9న హిందీలో విడుదలైన ఈ సినిమాను, వచ్చేనెల 6న తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు తెరపై ఐశ్వర్యరాయ్ ని చూడాలనుకునే ఆమె అభిమానులను ఈ సినిమా ఎంతవరకూ ఆకట్టుకుంటుందో మరి.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)