ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'బెంగాల్ టైగర్' వచ్చేది అప్పుడే!

Sat, Oct 31, 2015
రవితేజ
రవితేజ
'బెంగాల్ టైగర్' సినిమా విడుదల తేదీ మళ్లీ మారింది. ఈ సినిమాను డిసెంబర్ 4న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. రవితేజ కథానాయకుడిగా సంపత్ నంది తెరకెక్కించిన ఈ సినిమాను దీపావళి సందర్భంగా నవంబర్ 5న విడుదల చేయనున్నట్టు ఆ మధ్య ప్రకటించారు. అయితే, ఆ తేదీన కుదరడం లేదనీ, నవంబర్ 27న విడుదల చేయనున్నారనే వార్తలు షికారు చేశాయి.

ఇక తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, డిసెంబర్ 4న ఈ సినిమాను రిలీజ్ చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. దర్శకుడు సంపత్ నందికి .. రవితేజకి మాస్ పల్స్ బాగా తెలుసు. అందువలన వాళ్లకి సంతృప్తిని కలిగించే విధంగానే ఈ సినిమా తెరకెక్కింది. ఇక తమన్నా - రాశీఖన్నాల గ్లామర్ కూడా తోడు కావడంతో ఈ సినిమాపై మాస్ ఆడియన్స్ చూపు మరింత ఎక్కువగానే వుంది. సక్సెస్ కోసం ఆరాటపడుతోన్న రవితేజకి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ముట్టజెబుతుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)