ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అల్లు అరవింద్ చేతుల్లోకి చరణ్ సినిమా

Sat, Oct 31, 2015
చరణ్
చరణ్
'బ్రూస్ లీ' సినిమా తరువాత చరణ్ 'తని ఒరువన్' రీమేక్ చేయనున్నాడనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకి నిర్మాత డీవీవీ దానయ్య అని కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ సినిమా నిర్మాతగా అల్లు అరవింద్ వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని గురించిన రకరకాల వార్తలు ఫిల్మ్ నగర్లో షికారు చేస్తున్నాయి.

చరణ్ 'బ్రూస్ లీ' సినిమాని డీవీవీ దానయ్య నిర్మించాడు. ఈ సినిమాపై నమ్మకంతో ఆయన, చరణ్ తదుపరి సినిమాను కూడా తాను నిర్మించనున్నట్టు చెప్పాడు. అయితే 'బ్రూస్ లీ' ఫలితం నిరాశాజనకంగా రావడంతో, ఆయన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఇక చిరంజీవి కూడా 'బ్రూస్ లీ' ఫలితాన్ని గురించి అరవింద్ తో చర్చించి, ఇక మీదట చరణ్ సినిమా వ్యవహారాలను దగ్గరుండి చూసుకోమని కోరాడట. ఈ నేపథ్యంలో 'తని ఒరువన్' కథ విషయంలో మార్పులు .. చేర్పులు చూసుకోవడమే కాకుండా, ఆ సినిమాకి ఆయన నిర్మాతగా కూడా వ్యవహరించనున్నాడని అంటున్నారు. మరి ఈ సారైనా చరణ్ కి హిట్ దొరుకుతుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.205.89.199
Movie News (Latest)