ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గుణశేఖర్ దర్శకత్వంలో 'వీరాభిమన్యు'?

Fri, Oct 30, 2015
గుణశేఖర్
గుణశేఖర్
ఫిల్మ్ నగర్లో తాజాగా ఒక వార్త షికారు చేస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో 'వీరాభిమన్యు' చిత్రం రూపొందనుందనేది ఆ వార్త సారాంశం. తాజాగా ఆయన గుణ టీమ్ వర్క్స్ పై ఈ టైటిల్ ని రిజిష్టర్ చేయించడమే ఇందుకు కారణమని అంటున్నారు. 'రుద్రమదేవి' సినిమాకి సీక్వెల్ గా 'ప్రతాపరుద్రుడు' ఉంటుందని గుణశేఖర్ ఇటీవల చెప్పాడు. ఆ టైటిల్ ని కూడా రిజిష్టర్ చేయించాడు. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడానికి దిల్ రాజు కూడా ముందుకు వచ్చాడు. దాంతో ఆ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళుతుందని అంతా అనుకున్నారు. అయితే ఈ లోగా ఆయన 'వీరాభిమన్యు' టైటిల్ ను రిజిష్టర్ చేయించడంతో, ఏది ముందుగా మొదలుకానుందనే సందేహం తలెత్తుతోంది. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం వుంది.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)