ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దీపావళికి 'బెంగాల్ టైగర్' రానట్టే!

Fri, Oct 30, 2015
రాశీఖన్నా
రాశీఖన్నా
దీపావళికి 'బెంగాల్ టైగర్' వచ్చే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది. రవితేజ సరసన తమన్నా- రాశీఖన్నా కథానాయికలుగా అలరించే ఈ సినిమా విడుదల మరి కాస్త ఆలస్యంగా జరగనున్నట్టు తెలుస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, నవంబర్ 5న విడుదల చేయనున్నట్టు గతంలో ప్రకటించారు.

అయితే కొన్ని కారణాల వలన 'బెంగాల్ టైగర్'ను దీపావళికి విడుదల చేయడం లేదని తెలుస్తోంది. ఈ సినిమా విడుదలకి సంబంధించి, త్వరలోనే మరో తేదీని ప్రకటించనున్నారు. 'కిక్ 2' ఫలితంతో డీలాపడిన రవితేజ కూడా ఈ సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. మరి, ఈసారైనా ఆయనకి ఆశించిన ఫలితం దక్కుతుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.163.173.253
Movie News (Latest)