ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'కబాలి'లో మెరవనున్న ఐశ్వర్యరాయ్?

Tue, Oct 27, 2015
ఐశ్వర్యరాయ్
ఐశ్వర్యరాయ్
కోలీవుడ్లో తాజాగా ఒక వార్త షికారు చేస్తోంది .. 'కబాలి' సినిమాలో ఐశ్వర్యరాయ్ కనిపించనుందనే టాక్ అక్కడ బలంగా వినిపిస్తోంది. రజనీకాంత్ - రాధిక ఆప్టే జంటగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే చెన్నై లో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, మలేసియా చేరుకుంది. అక్కడ రజనీకాంత్ పై యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో రజనీకాంత్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడనే టాక్ ఆ మధ్య వినిపించింది. అదే నిజమేనన్నట్టుగా ఇప్పుడు ఐశ్వర్యరాయ్ పేరు వినిపిస్తోంది. ఒక రజనీ సరసన ఆమె కనిపించనుందని అంటున్నారు. రజనీకాంత్ కోరడం వల్లనే ఈ పాత్ర చేయడానికి ఐశ్వర్యరాయ్ అంగీకరించిందని అంటున్నారు. కథలో కీలకమైనదిగా చెబుతోన్న ఈ పాత్రలో ఐశ్వర్య రాయ్ నటించడం నిజమే అయితే, ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోవడం ఖాయమని చెప్పొచ్చు.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)