ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పూరీ సినిమా వచ్చేది అప్పుడే!

Tue, Oct 27, 2015
పూరీ జగన్నాథ్
పూరీ జగన్నాథ్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'మా అమ్మ మహాలక్ష్మి' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో వేడుకను నవంబర్ చివర్లో నిర్వహించి, డిసెంబర్ 18న సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

వరుణ్ తేజ్ - దిశా పతాని జంటగా పూరీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకి మొదట్లో 'లోఫర్' అనే టైటిల్ ను పెడదామనుకున్నారు. కానీ ఈ సినిమాలో తల్లీ కొడుకుల సెంటిమెంట్ కు పెద్ద పీట వేయడం వలన, 'మా అమ్మ మహాలక్ష్మీ' టైటిల్ ను ఖరారు చేశారు. ఈ టైటిల్ ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి తీసుకువస్తుందని భావిస్తున్నారు. ఇటీవల విడుదలైన 'కంచె ' సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో, సహజంగానే ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి వరుణ్ తేజ్ కి అమ్మ సెంటిమెంట్ ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)