ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అందరి చూపు ఆమెపైనే!

Mon, Oct 26, 2015
అమీరా దస్తూర్
అమీరా దస్తూర్
తెలుగు తెరకి కొత్త కథానాయికల తాకిడి ఎక్కువైంది. ఆడియన్స్ బోర్ ఫీలవ్వకుండా ఉండటం కోసం ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలను అన్వేషించడం ఈ మధ్య మరింత ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలో ఒక కథానాయికను సంప్రదించే దర్శక నిర్మాతల సంఖ్య ఎక్కువగా ఉందనే మాట ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. అంతగా అందరి చూపును తనవైపుకి తిప్పుకున్న ఆ సుందరి పేరే 'అమీరా దస్తూర్'. ఈ అమ్మాయి ఇంతకు ముందు తమిళ్లో ధనుష్ జోడీగా 'అనేగన్' సినిమాలో అలరించింది.

రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కనున్న 'తని ఒరువన్' రీమేక్ లో కథానాయిక కోసం ఈ అమ్మాయిని సంప్రదించారట. ఇక ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్లో మొదలైన సినిమాలో హీరోయిన్ గా ఈ సుందరిని అడిగినట్టు తెలుస్తోంది. తాజాగా మొదలైన రవితేజ సినిమా 'ఎవడో ఒకడు'లో ఒక కథానాయికగా అమీరా డేట్స్ ను అడిగినట్టు సమాచారం. అంతేకాదు, నాగచైతన్య 'మజ్ను' సినిమాలో ఒక కథానాయికగా ఆమెని సంప్రదించినట్టు చెప్పుకుంటున్నారు. ఆమె మొదటి గ్రీన్ సిగ్నల్ ఎవరికిస్తుందోనని కొంతమంది అనుకుంటూ వుంటే, మరికొందరేమో అదృష్టమంటే అమీరాదే అనుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.150.143
Movie News (Latest)