ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వచ్చే నెలలోనే అసిన్ పెళ్లి!

Mon, Oct 26, 2015
అసిన్
అసిన్
కథానాయికగా దక్షిణాదిన కెరీర్ ప్రారంభించి... అనతికాలంలోనే బాలీవుడ్ రంగప్రవేశం చేసి, అక్కడ కూడా తనదైన ముద్ర వేసిన మలయాళ ముద్దుగుమ్మ అసిన్ వివాహం నవంబర్ 26న జరగనుంది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త రాహుల్ శర్మను ఈ చిన్నది ప్రేమ వివాహం చేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. వచ్చే నెల 26న ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్ లో వీరి వివాహ వేడుక సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో జరుగుతుంది. ఆ మర్నాడు ఢిల్లీ శివారులోని ఓ ఫామ్ హౌస్ లో వివాహవిందును ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత రెండు మూడు రోజులకి అసిన్ ముంబయ్ లో తన బాలీవుడ్ మిత్రులకు రిసెప్షన్ ఇస్తోంది.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)