ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

60 కోట్ల దిశగా 'రుద్రమదేవి'!

Sat, Oct 24, 2015
'రుద్రమదేవి' గా అనుష్క
'రుద్రమదేవి' గా అనుష్క
'రుద్రమదేవి' సినిమా 60 కోట్ల క్లబ్ కి చాలా దగ్గరలో ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకూ ఈ సినిమా 45 కోట్ల వరకూ రాబట్టింది. మరో 15 కోట్లు రాబడితే ఈ సినిమా 60 కోట్ల క్లబ్ లోకి చేరినట్టే. ఈ సినిమా శాటిలైట్ బిజినెస్ ఇంకా పూర్తి కాలేదు. 9 కోట్లతో శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకోవడానికి ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఉత్సాహాన్ని చూపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకో కోటి రూపాయలను గుణశేఖర్ డిమాండ్ చేస్తున్నట్టుగా వినికిడి.

అలా ఓ 10 కోట్లు అక్కడ వచ్చేస్తాయి కనుక, మరో 5 కోట్లు ఈ సినిమా వసూలు చేస్తే చాలని చెబుతున్నారు. అందుకు అవకాశం కూడా ఉందని అంటున్నారు. నిజానికి 'బ్రూస్ లీ' సినిమా రిలీజ్ తరువాత ఈ సినిమా కలెక్షన్స్ తగ్గుతాయని అనుకున్నారు. కానీ ఆ సినిమా రుద్రమదేవి వసూళ్లపై ప్రభావం చూపలేకపోయింది. ఇక 'కంచె' సినిమా కూడా రుద్రమదేవి హవాను అడ్డుకోలేకపోయింది. అందువలన చాలా థియేటర్లలో రుద్రమదేవి స్థిరంగా వసూళ్లు రాబడుతోంది కనుక, 60 కోట్ల క్లబ్ లోకి చేరుకునే అవకాశాలు బాగా ఉన్నాయని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)