ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మలేసియాలో 'కబాలి' సందడి

Sat, Oct 24, 2015
రజనీకాంత్
రజనీకాంత్
'కబాలి' సినిమా టీమ్ మలేసియా చేరుకుంది .. అక్కడ ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కథానాయకుడు రజనీకాంత్ పై యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. 'కబాలి' కథ వైవిధ్యభరితంగా ఉండటంతో, యువదర్శకుడు అని కూడా ఆలోచించకుండా రజనీకాంత్ ఓకే చెప్పాడు. అంతేకాదు .. తనకి గల ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కథను మార్చే ప్రయత్నం చేయకుండా, ఎలా అనుకుంటే అలా చిత్రీకరణ జరపమని స్వేచ్ఛను ఇచ్చాడట.

ఆ ఒక్కమాట చాలు అన్నట్టుగా దర్శకుడు రంజిత్ తనదైన స్టైల్లో చకచకా షూటింగును కానిచ్చేస్తున్నాడు. మొదటి షెడ్యూల్ ను చెన్నైలో పూర్తిచేసి, రెండవ షెడ్యూల్ నిమిత్తం ఇటీవల మలేసియా వెళ్లారు. అక్కడ రజనీకాంత్ .. విలన్ గ్యాంగ్ కి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్ ను తెరకెక్కిస్తున్నారు. ప్రధాన పాత్రలకి సంబంధించిన మరికొన్ని సన్నివేశాలను కూడా అక్కడ ప్లాన్ చేసుకున్నారట. ఈ సినిమా కోసం రజనీ అభిమానులంతా ఆసక్తిగా .. ఆతృతతో ఎదురుచూస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.140.252
Movie News (Latest)