ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తాప్సీ కి మరో ఛాన్స్ తగిలింది!

Wed, Oct 21, 2015
తాప్సీ
తాప్సీ
తెలుగు తెరపై గ్లామర్ కథానాయికగా ఓ మెరుపు మెరిసిన తాప్సీకి, కొంత గ్యాప్ తరువాత ఒక ఛాన్స్ తగిలింది. యువ కథానాయకుడు సందీప్ కిషన్ జోడీగా ఆమె ఎంపికైంది. ఈ విషయాన్ని ఆయనే తెలియజేయడం విశేషం. చక్కని మేని ఛాయతో తాప్సీ కుర్రకారు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వరుసగా ఆమెకి అవకాశాలు వచ్చాయి గానీ, వాటిలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకున్నవి తక్కువ. దాంతో సహజంగానే ఆమెకి తెలుగులో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.
ఈ నేపథ్యంలో ఆమె తమిళ సినిమాపై ఎక్కువగా దృష్టి పెట్టి, తెలుగులో చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానంటూనే సంకేతాలు పంపుతూ వస్తోంది. అలా ఈ సుందరి కాస్త ఆలస్యంగానైనా తెలుగులో మరో ఛాన్స్ దక్కించుకుంది. సందీప్ కిషన్ కథానాయకుడిగా సి.వి. కుమార్ తెరకెక్కిస్తోన్న ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా కోసం ఆమెని నాయికగా ఎంపిక చేశారు. మరి ఈ సినిమాతోనైనా మరిన్ని అవకాశాలు తాప్సీని వెతుక్కుంటూ వస్తాయేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.87.119.171
Movie News (Latest)