ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రౌడీలతో తలపడుతోన్న నితిన్!

Wed, Oct 21, 2015
నితిన్
నితిన్
నితిన్ అలా రోడ్ పై వెళుతూ ఉండగా ఒక్కసారిగా కొంత మంది రౌడీలు అతనిపై దాడి చేశారు. అనుకోని ఆ సంఘటనకి నితిన్ ఒక్క క్షణం బిత్తరపోయినా, వెంటనే తేరుకుని వాళ్ల భరతం పట్టాడు. 'అ .. ఆ' సినిమా కోసం ఈ పోరాట సన్నివేశాన్ని దర్శకుడు త్రివిక్రమ్ చిత్రీకరించాడు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ను ఈ నెల 16న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలుపెట్టారు. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుతం నితిన్ .. కొంతమంది రౌడీ పాత్ర ధారులకి మధ్య యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు.
రవివర్మ కంపోజ్ చేసిన యాక్షన్ దృశ్యాలు ఆడియన్స్ తో విజిల్స్ వేయిస్తాయని అంటున్నారు. నితిన్ జోడీగా సమంతా .. అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా అలరించనున్నారు. ఇక నితిన్ అత్తగా నదియా కనిపించనుంది. 'వాలెంటైన్స్ డే' సందర్భంగా ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)