ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఊపిరి' విడుదల అప్పుడేనట!

Wed, Oct 21, 2015
'ఊపిరి'లో తమన్నా, కార్తి
'ఊపిరి'లో తమన్నా, కార్తి
నాగార్జున అభిమానులు ఆయన సినిమా 'ఊపిరి' గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది. షూటింగ్ విషయంలో జరిగిన ఆలస్యమే ఇందుకు కారణమని చెబుతున్నారు. నాగార్జున .. కార్తీ .. తమన్నా కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా, ఎక్కువ భాగం విదేశాల్లోనే షూటింగ్ జరుపుకుంది. ఇప్పటివరకూ 80 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది.
ఈ నెల చివరన తాజా షెడ్యూల్ ను ఆరంభించి, వచ్చేనెలలో షూటింగ్ పార్టును పూర్తి చేయనున్నారు. ఆ తరువాత మిగతా కార్యక్రమాలను పూర్తి చేసి, వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్టుగా సమాచారం. నవంబర్లో అఖిల్ .. డిసెంబర్లో నాగచైతన్య .ఆడియన్స్ ను పలకరిస్తే, జనవరిలో నాగార్జున అలరించే అవకాశం ఉందన్నమాట.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)