ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భల్లాలదేవుడి భార్యగా శ్రియ!

Tue, Oct 20, 2015
శ్రియ
శ్రియ
భల్లాలదేవుడు .. 'బాహుబలి' సినిమా కోసం రాజమౌళి జీవం పోసిన పాత్ర .. రానా పోషించి అందరిచే ప్రశంసలు అందుకున్న పాత్ర. ఈ పాత్రకి భార్యగా అందాల కథానాయిక శ్రియ కనిపించనున్నట్టు తెలుస్తోంది. తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా శ్రియ ఒక వెలుగు వెలిగింది. ఆ తరువాత అవకాశాలు ఆశించిన స్థాయిలో లేకపోయినా, అడపాదడపా ప్రాధాన్యత గల కొన్ని పాత్రలను పోషిస్తూ వస్తోంది. అలా ఆమె 'బాహుబలి 2' లోను అవకాశాన్ని దక్కించుకుందని అంటున్నారు.
ఈ సినిమాలో భల్లాల దేవుడు ప్రతినాయకుడిగా కనిపిస్తాడు. దేవసేన తనకి వశం కాకుండా బాహుబలికి మనసిచ్చినందుకు ఆయన ఆమెని బంధిస్తాడు. అలాంటి భల్లాల దేవుడికి భార్యగా శ్రియ నటిస్తుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సీక్వెల్లో సూర్య కి ఒక పాత్ర లభించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా శ్రియ కూడా ఒక పాత్ర దొరికిందని అంటున్నారు. ఇంకా ఈ సినిమాలోని ఇతర పాత్రలకి గాను ఎవరెవరికి ఎలాంటి పాత్రలు లభించనున్నాయనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)