ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సల్మాన్ ఖాన్ కి చరణ్ డబ్బింగ్

Tue, Oct 20, 2015
రామ్ చరణ్
రామ్ చరణ్
అవును .. సల్మాన్ ఖాన్ కి చరణ్ డబ్బింగ్ చెబుతున్నాడు .. ఈ రోజునే ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు కూడా. సల్మాన్ నటిస్తోన్న 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' దీపావళికి రిలీజ్ అవుతోన్న విషయం తెలిసిందే. తెలుగులోకి అనువదించబడుతోన్న ఈ సినిమాలో, సల్మాన్ పాత్రకి చరణ్ డబ్బింగ్ చెబుతున్నాడు.
మెగాస్టార్ ఫ్యామిలీతో సల్మాన్ ఖాన్ కి మంచి స్నేహ బంధం వుంది. చరణ్ ఆ మధ్య బాలీవుడ్ సినిమా చేస్తోన్న సందర్భంలోనూ ఆయనకి అక్కడ సల్మాన్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. ఇక చరణ్ పెళ్లికి సల్మాన్ ముందుగా వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. అందువల్లనే సల్మాన్ అడగడంతోనే చరణ్ ఒకే అనేశాడట.
ఈ సినిమాను తెలుగులో విడుదల చేయాలని రాజశ్రీ ప్రొడక్షన్స్ వారు నిర్ణయించుకోగానే, చరణ్ కి సల్మాన్ ఫోన్ చేయడం .. చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం .. పని మొదలు పెట్టడం జరిగిపోయాయి. చరణ్ డబ్బింగ్ తప్పకుండా ఇక్కడ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అవుతుందని చెప్పొచ్చు. గతంలో రాజశ్రీ ప్రొడక్షన్స్ సల్మాన్ తో చేసిన 'మైనే ప్యార్ కియా' తెలుగులో 'ప్రేమ పావురాలు'గా వచ్చి అఖండ విజయాన్ని అందుకుంది. మరి ఈ సారి కూడా అలాంటి హిట్ ఈ కాంబినేషన్ కి దొరుకుతుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)