ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సోదరుడి బ్యానర్లో ఎన్టీఆర్

Mon, Oct 19, 2015
ఎన్టీఆర్
ఎన్టీఆర్
ప్రస్తుతం 'నాన్నకు ప్రేమతో' షూటింగులో బిజీగా వున్న జూనియర్ ఎన్టీఆర్ మరోపక్క కొత్త సినిమాల ప్లానింగు కూడా చేసుకుంటున్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ కు ఓ చిత్రం చేయడానికి ఓకే చెప్పాడు. ఈ విజయదశమికి ఇది మొదలవుతోంది. మరోపక్క, సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్ బ్యానర్ 'ఎన్టీఆర్ ఆర్ట్స్'లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి దీని షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)