ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

టీజర్ రిలీజ్ చేసిన 'బెంగాల్ టైగర్'

Wed, Oct 14, 2015
రవితేజ - తమన్నా
రవితేజ - తమన్నా
ముందుగా చెప్పినట్టుగానే 'బెంగాల్ టైగర్' టీజర్ ను ఈ రోజు ఉదయం రిలీజ్ చేశారు. దర్శకుడు సంపత్ నంది ఈ టీజర్ ను తన ఫేస్ బుక్ ద్వారా విడుదల చేశాడు. '' నేను క్లైమేట్ లాంటోడ్ని .. అప్పుడప్పుడు చల్లగా ఉంటా .. అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా .. అప్పుడప్పుడు వణికిస్తా!'' అంటూ రవితేజ చెప్పే డైలాగ్ పై యాక్షన్ బిట్స్ ను కట్ చేస్తూ ఈ టీజర్ ను రూపొందించారు.

రవితేజ స్టైల్ .. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే తీరుగా చిత్రీకరించిన సాంగ్ బిట్ ఈ టీజర్ లో కనిపిస్తోంది. రవితేజ ఫ్యాన్స్ కి నచ్చే విధంగా ఈ టీజర్ ఉందని చెప్పొచ్చు. ఆడియోను ఈ నెల 18న విడుదల చేసి, సినిమాను దీపావళి సందర్భంగా నవంబర్ 5న విడుదల చేయనున్నారు. 'కిక్ 2'తో డీలాపడిన రవితేజను ఈ సినిమా ఎంతవరకూ ఉత్సాహపరుస్తుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)