ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దిల్ రాజు నిర్మాతగా 'ప్రతాపరుద్రుడు'

Wed, Oct 14, 2015
దిల్ రాజు
దిల్ రాజు
కాకతీయుల పరిపాలనా వైభవం 'ప్రతాపరుద్రుడు' కాలంలోనూ కొనసాగింది. అలాంటి ప్రతాపరుద్రుడు జీవిత విశేషాలను గుణశేఖర్ తెరకెక్కించాలని అనుకుంటే, తాను నిర్మాతగా వ్యవహరిస్తానని నిర్మాత దిల్ రాజు చెప్పాడు. 'రుద్రమదేవి' సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశాడు.

'రుద్రమదేవి' సినిమా షూటింగ్ పూర్తవుతోన్న సమయంలోనే దర్శకుడు గుణశేఖర్ 'ప్రతాపరుద్రుడు' టైటిల్ ను రిజిష్టర్ చేయించాడు. రుద్రమదేవి జీవిత విశేషాలను తెలుసుకునే క్రమంలో, ప్రతాపరుద్రుడికి సంబంధించిన విశేషాలు గుణశేఖర్ ను ఎంతగానో ఆశ్చర్యచకితుణ్ణి చేశాయట. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ గా ఆయన జీవిత చరిత్రను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు ముందుకు రావడం పట్ల గుణశేఖర్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)