ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Wed, Oct 14, 2015
గుణశేఖర్
గుణశేఖర్
* 'రుద్రమదేవి' సక్సెస్ మీట్ నిన్న రాత్రి హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమంలో గుణశేఖర్ .. అనుష్క .. అల్లు అర్జున్ .. దిల్ రాజు .. కృష్ణంరాజు .. సిరివెన్నెల తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా విషయంలో సహకరించిన సినీ ప్రముఖులకు .. ఆదరించిన ప్రేక్షకులకు గుణశేఖర్ ధన్యవాదాలు తెలియజేశాడు.

* 'సావిత్రి' సినిమాకి ముహూర్తం కుదిరింది. అక్టోబర్ 23 నుంచి హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. నారా రోహిత్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాకి పవన్ సాధినేని దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.
* బ్రహ్మానందం ప్రధాన పాత్రని పోషించిన 'ఎలుకా మజాకా' చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రేలంగి నరసింహారావు తెరకెక్కించిన ఈ సినిమాలో, సందర్భాన్ని బట్టి బ్రహ్మానందం ఎలుకలా మారిపోతూ అలరిస్తాడట.
*'సిందూర పువ్వు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన రాంకీ, ఆ తరువాత వరుసగా తమిళ సినిమాలు చేస్తూ వెళ్లాడు. ఇప్పుడు ఈ కథానాయకుడు తెలుగు చిత్రాలవైపు మొగ్గుచూపుతున్నాడు. తనకి తగిన పాత్ర అనుకుంటే నటించడానికి సిద్ధమని చెబుతున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.197.142.219
Movie News (Latest)