ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ కి విలన్ గా అరవింద్ స్వామి!

Mon, Oct 12, 2015
అరవింద్ స్వామి
అరవింద్ స్వామి
తమిళ్లో 'తని ఒరువన్' చిత్రం ఘనవిజయాన్ని సాధించడంతో, చరణ్ కథానాయకుడిగా ఆ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. తమిళ్లో ఈ సినిమాలో అరవింద్ స్వామి విలన్ గా నటించి, అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు. ఇక తెలుగులో వెర్షన్ కి సంబంధించి, విలన్ గా నాగార్జున .. రానా పేర్లు వినిపించాయి.

ఇటీవల మాధవన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం, తెలుగు రీమేక్ కోసం కూడా అరవింద్ స్వామిని ఒప్పించినట్టు తెలుస్తోంది. అరవింద్ స్వామి మొదట నిరాకరించినా, దర్శకుడు సురేందర్ రెడ్డి ఒత్తిడి చేయడంతో ఓకే చెప్పాడని అంటున్నారు. అందమైన హీరోగా మాత్రమే అరవింద్ స్వామిని చూసిన తెలుగు ప్రేక్షకులు, విలన్ గా ఆయనని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)