ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

32 కోట్లు రాబట్టిన 'రుద్రమదేవి'

Mon, Oct 12, 2015
'రుద్రమదేవి' గా అనుష్క
'రుద్రమదేవి' గా అనుష్క
'రుద్రమదేవి' మొదటి మూడు రోజుల్లో 32 కోట్లు వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 9న తెలుగు - హిందీ భాషల్లో ఈ సినిమా భారీస్థాయిలో విడుదలైంది. తమిళ్లో ఈ శుక్రవారం విడుదల కానుంది. దాంతో తెలుగు .. హిందీ వెర్షన్లు మాత్రమే కలుపుకుని, మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా 32 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.

ఇక తమిళ్లోను ఈ సినిమా పట్ల అంతా ఆసక్తిని చూపిస్తుండటం వలన, భారీ ఓపెనింగ్స్ ఉండవచ్చనే టాక్ వినిపిస్తోంది. 'రుద్రమదేవి' జీవితం ఆసక్తికరమైన అంశం కావడం .. ఈ సినిమా 2Dలోను .. 3Dలోను విడుదల కావడం ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించింది. ఇక నటీనటులు .. వాళ్ల గెటప్పులు .. గ్రాఫిక్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా రిలీజ్ రోజునే 'గోన గన్నారెడ్డి' పాత్రలో బన్నీ యాక్టింగ్ అదుర్స్ అనే టాక్ రావడంతో, ప్రేక్షకుల సందడి మరింత పెరిగింది. ఈ అంశాలన్నీ కూడా ఈ స్థాయి కలెక్షన్స్ కి కారణమయ్యాయని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)