ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో కథకి ఓకే చెప్పిన ఎన్టీఆర్

Sat, Oct 10, 2015
ఎన్టీఆర్
ఎన్టీఆర్
ఎన్టీఆర్ మరోకొత్త కథకి ఓకే చెప్పాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఆ కథా రచయిత .. దర్శకుడు వక్కంతం వంశీ అని అంటున్నారు. వక్కతం వంశీ కథలు అనూహ్యమైన మలుపులతో ఆసక్తికరంగా కొనసాగుతూ ఉంటాయి. ఆయన కథలను అందించిన సినిమాలు కొన్ని సూపర్ హిట్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి.

ఆయన ఎన్టీఆర్ సినిమాకి కథను అందించడమే కాకుండా, దర్శకత్వం కూడా చేయనున్నాడనే టాక్ కొంతకాలం వినిపిస్తోంది. తాజాగా ఆయన వినిపించిన కథను ఎన్టీఆర్ ఓకే చేయడమే కాకుండా, ఆయననే దర్శకత్వం కూడా చేయమని చెప్పాడట. అయితే ఎన్టీఆర్ తో సినిమాలు చేయడానికి కొరటాల .. గోపీచంద్ మలినేని సిద్ధంగా వున్నారు. వాళ్ల సినిమాల తరువాత వక్కంతం వంశీ కథ సెట్స్ పైకి వెళ్లవచ్చని అనుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.121.63
Movie News (Latest)