ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అమెరికాలోను 'రుద్రమదేవి'కి అదే క్రేజ్!

Sat, Oct 10, 2015
'రుద్రమదేవి' గా అనుష్క
'రుద్రమదేవి' గా అనుష్క
ప్రపంచవ్యాప్తంగా 'రుద్రమదేవి' సినిమా నిన్న విడుదలైంది. తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకాదరణ లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సందడి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఇక అమెరికాలోను ఈ సినిమాకి అదే స్థాయిలో క్రేజ్ కనిపిస్తోంది. అక్కడ 150 స్క్రీన్స్ పై ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. ఈ ప్రీమియర్ షోల వలన 127,276 డాలర్లు వసూలైనట్టు తెలుస్తోంది.

ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టడం గొప్ప విషయమనీ, వారాంతంలో కలెక్షన్స్ మరింతగా పెరగవచ్చని అంటున్నారు. 'రుద్రమదేవి' వీరనారి అనే విషయాన్ని చాలామంది వినివున్నారు. అయితే ఆమె జీవితంలోని విశేషాలను తెలుసుకోవాలనే కుతూహలం ఆడియన్స్ లో పెరుగుతూ వచ్చింది. ఇక గుణశేఖర్ దర్శక ప్రతిభ .. పాత్రలకి నిండుదనాన్ని తీసుకొచ్చిన నటీనటులు .. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా రూపొందడం వల్లనే ఈ సినిమాకి ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రావడానికి కారణమనే టాక్ వినిపిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.211.11.50
Movie News (Latest)