ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కొరటాల వైపు అఖిల్ చూపు

Fri, Oct 09, 2015
అఖిల్
అఖిల్
'అఖిల్' సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ మొదటి సినిమా కావడంతో, అందరూ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖిల్ రెండో సినిమాకి సంబంధించిన టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఆయన తన రెండో సినిమాను కొరటాల శివతో చేయడానికే మొగ్గుచూపుతున్నాడని అంటున్నారు. 'అఖిల్' రెండో సినిమా పూరీ జగన్నాథ్ తో ఉండొచ్చనే టాక్ ఆ మధ్య వినిపించింది. అయితే అఖిల్ అందుకు ఆసక్తి కనబరచలేదని అంటున్నారు.

మొదటి సినిమాతో వినాయక్ తనని యూత్ కీ .. మాస్ ఆడియన్స్ కి చేరువ చేస్తే, కొరటాల తనని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరగా తీసుకెళతాడని అఖిల్ భావించాడట. ఇక ఈ నెలలోనే ఎన్టీఆర్ తో కొరటాల సినిమా లాంచ్ కానుంది. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి మరికాస్త సమయం పడుతుంది కనుక, ఆలోగా అఖిల్ సినిమాను గురించిన ఆలోచన చేయమని కొరటాలను నాగ్ కోరుతున్నాడని అంటున్నారు. మరి కొరటాల శివ ఏం చేస్తాడో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)