ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మారుతి మంచికథతో వస్తాడట!

Thu, Oct 08, 2015
మారుతి
మారుతి
మంచికథను సిద్ధం చేస్తున్నాననీ .. రెడీ కాగానే కథానాయకుడు ఎవరన్నది చెబుతానని దర్శకుడు మారుతి అన్నాడు. ఈ రోజున తన పుట్టినరోజును సన్నిహితుల సమక్షంలో జరుపుకున్న ఆయన, తదుపరి సినిమా ఎవరితో? అనే ప్రశ్నకి సమాధానంగా ఈ మాటను అన్నాడు. తొలి సినిమాతోనే .. యూత్ ని ఆకట్టుకోవడమెలాగో మారుతికి బాగా తెలుసునని అనిపించుకున్నాడు.

ఆయన సినిమా వస్తుందంటే కుర్రాళ్లు ఎంతో ఆసక్తిని కనబరుస్తూ వుంటారు. ఇక ఇటీవల మారుతి తెరకెక్కించిన 'భలేభలే మగాడివోయ్' సినిమా, దర్శకుడిగా ఆయనని మరో మెట్టుపైకి ఎక్కించింది. అందువల్లనే ఆ స్థాయికి తగ్గకుండా తాను మరో మంచికథతో .. అదీ కొత్తదనంతో కూడిన కథతో వస్తానని మారుతి చెప్పాడు. మరి ఆ కథను మారుతి ఎప్పుడు సిద్ధం చేస్తాడో .. ఏ కథానాయకుడితో ఎప్పుడు సెట్స్ పైకి వెళతాడో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)