ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎన్టీఆర్ తో కొరటాల సినిమా ఖాయమైనట్టే!

Thu, Oct 08, 2015
ఎన్టీఆర్
ఎన్టీఆర్
ఎన్టీఆర్ తదుపరి సినిమా ఏ దర్శకుడితో ఉండనుందనే ఫిల్మ్ నగర్ చర్చల్లో ఆ మధ్య కొరటాల శివ పేరు ఎక్కువగా వినిపించింది. అనుకున్నట్టుగానే ఈ కాంబినేషన్ ఖరారైనట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 25న ఈ ఇద్దరి కాంబినేషన్లోని సినిమా లాంచ్ అవుతుందని సమాచారం. కొరటాలతో 'శ్రీమంతుడు' చిత్రాన్ని తెరకెక్కించిన మైత్రీ మూవీ మేకర్స్ వారే ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారట.

ముందుగా ఎన్టీఆర్ తోనే కొరటాల సినిమా ఉంటుందనే టాక్ వినిపించినా, ఆ తరువాత అనేక వార్తలు షికారు చేశాయి. కొరటాల తదుపరి సినిమా అఖిల్ తో ఉండే అవకాశం ఉందనీ, గోపీచంద్ మలినేనితో ఎన్టీఆర్ సినిమా ఉండవచ్చనే ప్రచారం జరిగింది. చివరికి ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషనే ఖరారైనట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ అభిమానులకి ఈ దసరా మరింత ప్రత్యేకమన్న మాట!
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)