ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'సర్దార్' స్టెప్స్ అదుర్స్ అంటోన్న దేవిశ్రీ!

Wed, Oct 07, 2015
పవన్ తో దేవిశ్రీ ప్రసాద్
పవన్ తో దేవిశ్రీ ప్రసాద్
'సర్దార్ గబ్బర్ సింగ్' లో పవన్ - రాయ్ లక్ష్మీల ఐటమ్ ఒక రేంజ్ లో వుంటుంది .. పవన్ స్టెప్స్ చూసి తీరాల్సిందే అంటూ, ఆ సినిమా సెట్లో పవన్ తో దిగిన ఫోటోను దేవిశ్రీప్రసాద్ తన ఫేస్ బుక్ లోను .. ట్విట్టర్ లోను పోస్ట్ చేశాడు. పవన్ నటించిన సూపర్ హిట్ చిత్రాలకి దేవిశ్రీ సంగీతాన్ని అందించాడు.

పవన్ అభిమానులు ఆయన నుంచి కోరుకునేదేమిటో దేవిశ్రీకి బాగా తెలుసు. దేవిశ్రీ గురించి పవన్ కి కూడా తెలుసు కనుకే, తన సినిమా ఆడియో విషయంలో ఆయన నిశ్చింతగా ఉంటాడు. తాజాగా 'సర్దార్ గబ్బర్ సింగ్'కి కూడా దేవిశ్రీనే సంగీతాన్ని సమకూర్చాడు. ఆ పాటల్లో ఐటమ్ సాంగ్ ని ఇటీవల చిత్రీకరిస్తూ ఉండగా, దేవిశ్రీప్రసాద్ ఆ సెట్ కి వెళ్లాడట. పవన్ స్టెప్స్ చూసి ఫుల్ ఖుషీ అయ్యానని చెప్పాడు. 'గబ్బర్ సింగ్' సినిమాలో 'కెవ్వు కేక' ఐటమ్ ను మించి ఈ ఐటమ్ అలరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదంటూ, పవన్ తో దిగిన ఫోటోను ఉత్సాహంతో పోస్ట్ చేశాడు.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)