ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఈగ'కి థ్యాంక్స్ చెప్పిన రాజమౌళి!

Wed, Oct 07, 2015
రాజమౌళి
రాజమౌళి
'ఈగ'కి రాజమౌళి మరోసారి థ్యాంక్స్ చెప్పాడు .. తన కెరియర్ కి ఎంతగానో దోహదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశాడు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఆయన, అక్కడ ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఫేస్ బుక్ .. ట్విట్టర్ ద్వారా 'ఈగ'కి థ్యాంక్స్ చెప్పాడు. 'బుసాన్' ఫిల్మ్ ఫెస్టివల్ లో 'బాహుబలి' సినిమా ప్రదర్శించిన అనంతరం, అక్కడి నిర్వాహకులు .. 'బాహుబలి'కే కాదు .. 'ఈగ' దర్శకుడు కూడా ఆయనేనంటూ రాజమౌళిని ప్రేక్షకులకు పరిచయం చేశారట.

'ఈగ' సినిమాను కూడా 2012లో 'బుసాన్'లో ప్రదర్శించారు. అందువలన ఆ మాట వినగానే ప్రేక్షకులంతా ఆనందాశ్చర్యాలకి లోనుకావడం రాజమౌళి గమనించాడు. 'ఈగ' చిత్రానికి కూడా ఆయనే దర్శకుడని తెలియగానే, వాళ్లంతా ఆటోగ్రాఫ్ ల కోసం ఎగబడ్డారట. 'ఈగ' సినిమా వాళ్లపై ఏ స్థాయిలో ప్రభావం చూపిందనేది ఆయనకి అర్థమైపోయింది. ఆ సమయంలో ఆయన పొందిన ఆనందం అంతా ఇంతా కాదట. అందుకే అక్కడి నుంచి రాగానే, మరోసారి 'ఈగ'కి థ్యాంక్స్ చెప్పుకున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.211.11.50
Movie News (Latest)