ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మళ్లీ రంగంలోకి దిగిన సిమ్రాన్!

Tue, Oct 06, 2015
సిమ్రాన్
సిమ్రాన్
సిమ్రాన్ .. తెలుగు - తమిళ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఈ రెండు భాషలలోను సిమ్రాన్ తరువాత అంత హైటు .. నాజూకుతనం కలిగిన కథానాయికలు రాలేదనే వారున్నారు. ఆ లోటు తీర్చడం కోసం అన్నట్టుగా మళ్లీ కథానాయికగా కనిపించడానికి సిమ్రాన్ సిద్ధమవుతోంది. అయితే ఆమె కథానాయికగా నటిస్తున్నది తన భర్త నిర్మిస్తోన్న సినిమాలోనే కావడం విశేషం.

తెలుగులో చిరంజీవి .. బాలకృష్ణ .. వెంకటేష్ .. నాగార్జున వంటి అగ్రకథానాయకుల జోడీకట్టిన సిమ్రాన్, తమిళ్లోను అగ్రకథానాయిక అనిపించుకుంది. ఆ తరువాత పెళ్లి చేసుకుని సినిమాలకి దూరమైన ఆమె, కొంత గ్యాప్ తరువాత వయసుకి తగిన పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల వచ్చిన 'త్రిష ఇల్లన నయనతార' సినిమాలో తళుక్కున మెరిసి యూత్ ను ఆకట్టుకుంది. తనకున్న క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదని భావించిన ఆమె, తానే ప్రధాన పాత్రగా తమిళ్లో రూపొందనున్న ఒక యాక్షన్ థ్రిల్లర్ లో నటించడానికి రెడీ అవుతోంది. గౌరీశంకర్ దర్శకత్వంలో పోలీస్ అధికారిణిగా సిమ్రాన్ నటించనున్న ఈ సినిమా, వచ్చేనెలలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.147.236.192
Movie News (Latest)