ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ కొత్త సినిమా అప్ డేట్స్!

Tue, Oct 06, 2015
చరణ్
చరణ్
చరణ్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్లోని సినిమాను వచ్చే నెలలో లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయని అంటున్నారు. ఇటీవల తమిళ్లో ఘనవిజయాన్ని అందుకున్న 'తని ఒరువన్' రీమేక్ లో నటించడానికి చరణ్ ఆసక్తిని చూపించాడు. ఈ సినిమాలో ఆయన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

చరణ్ కథానాయకుడిగా రూపొందిన 'బ్రూస్ లీ' సినిమా మరో పది రోజుల్లో విడుదల కానుంది. దాంతో 'తని ఒరువన్' రీమేక్ కి సంబంధించిన సన్నాహాలు మొదలుపెట్టారు. డీవీవీ దానయ్య - ఎన్వీ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించనున్న ఈ సినిమా, వచ్చేనెలలో లాంచనంగా మొదలవుతుంది. ఆ తరువాత నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవుతుంది. 'కిక్ 2' ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ఈ సినిమాతో హిట్ అందుకోవాలనే పట్టుదలతో సురేందర్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది.
X

Feedback Form

Your IP address: 50.16.52.237
Movie News (Latest)