ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అందం తెచ్చిన ఆనందంతో త్రిష

Tue, Oct 06, 2015
త్రిష
త్రిష
త్రిష ఆనందంతో పొంగిపోతోంది .. సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతోంది. ఎందుకూ అంటే .. చాలా అందంగా కనిపిస్తూ ఉన్నావంటూ సన్నిహితులు ఆమెకి ఫోన్లు చేసి పొగిడేయడమే. తాను చాలా అందగత్తెననే విషయం నిజమేగానీ .. ఆ అందాన్ని మరింత ఎక్కువగా చేసింది మాత్రం గౌతమి అని చెబుతోంది త్రిష. ఆమె కథానాయికగా నటించిన 'చీకటి రాజ్యం' సినిమాకి గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించింది.

ముఖ్యంగా త్రిష కోసం గౌతమి తయారు చేసిన కాస్ట్యూమ్స్ లో త్రిష మరింత అందంగా కనిపిస్తోందట. ఈ సినిమాకి సంబంధించిన త్రిష స్టిల్స్ చూసిన ఆమె సన్నిహితులు ఫోన్ చేసి మరీ ఈ విషయాన్ని చెబుతున్నారని అంటోంది. తాను ఇంతవరకూ చాలా సినిమాల్లో నటించినప్పటికీ, కాస్ట్యూమ్స్ విషయంలో తనకి ఎక్కువ మార్కులు లభించింది మాత్రం ఈ సినిమాతోనేనని త్రిష చెబుతోంది. తాను చాలా అందంగా కనిపిస్తున్నానని అంతా అంటూ ఉంటే హ్యాపీగా ఉందనీ, అందుకు కారణమైన గౌతమికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.211.121.63
Movie News (Latest)