ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ సినిమాలో షామిలి లేదట!

Mon, Oct 05, 2015
షామిలి
షామిలి
కొంత కాలం క్రితం 'ఓయ్' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన షామిలి, ఆ తరువాత వెండితెరపై మళ్లీ కనిపించలేదు. విదేశాల్లో చదువు పూర్తిచేసుకుని వచ్చిన ఈ చిన్నది తిరిగి నటిస్తోందనే వార్తలు షికారు చేస్తోన్న నేపథ్యంలో, ఆమె ఒక తెలుగు సినిమాలోను నటిస్తుందనే టాక్ ఈ మధ్య వినిపించింది. అయితే ఆ వార్తలో నిజం లేదని తెలుస్తోంది.

విదేశాల నుంచి మరింత నాజూకుగా తిరిగి వచ్చిన షామిలి, తమిళ్లో రెండు సినిమాలకి ఓకే చెప్పింది. ధనుష్ జోడీగాను .. విక్రమ్ ప్రభు సరసన ఆమె నటిస్తోంది. ఈ నేపథ్యంలో నారా రోహిత్ కథానాయకుడిగా రూపొందనున్న 'కథలో రాజకుమారి' సినిమాలో కథానాయిక పాత్రలో ఆమె కనిపించనుందనే వార్త షికారు చేసింది. అయితే ఈ సినిమాలో ఆమె నటించడం లేదట. ప్రస్తుతం షామిలి రెండు తమిళ సినిమాలకి మాత్రమే ఓకే చెప్పిందనీ .. ఏ తెలుగు సినిమాను ఆమె ఇంతవరకూ అంగీకరించలేదని సన్నిహితులు చెప్పినట్టుగా తెలుస్తోంది. మరిక 'కథలో రాజకుమారి'గా ఎవరు కనిపిస్తారో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)