ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ మూవీపై కోలీవుడ్ టాక్!

Mon, Oct 05, 2015
మహేశ్ బాబు
మహేశ్ బాబు
మహేశ్ బాబు .. మురుగదాస్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కనుందనే విషయం కొన్ని రోజులుగా వినిపిస్తున్నదే. అయితే ఆ సినిమా 'గజిని'కి సీక్వెల్ అనే వార్త కోలీవుడ్లో షికారు చేస్తోంది. గతంలో సూర్య కథానాయకుడిగా తమిళ్లో మురుగదాస్ తెరకెక్కించిన 'గజిని' అక్కడ ఘనవిజయాన్ని అందుకుంది. అనువాద చిత్రంగా తెలుగులోకి అడుగుపెట్టి భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఇదే చిత్రాన్ని ఆయన హిందీలో అమీర్ ఖాన్ తో రూపొందించి, అక్కడ కూడా సంచలన విజయాన్ని సాధించాడు.

అలాంటి సినిమాకి సీక్వెల్ ని మహేశ్ తో మురుగదాస్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. అయితే ఇది రూమర్ మాత్రమే కావొచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఎందుకంటే షర్ట్ విప్పి కండలు చూపించడానికి మహేష్ ఎక్కువగా ఇష్టపడడని వాళ్లు చెబుతున్నారు. అంతేకాదు .. మురుగదాస్ ఇంతవరకూ ఏ సినిమాకి సీక్వెల్ చేయకపోవడాన్ని గుర్తుచేస్తున్నారు. మరి మహేశ్ - మురుగదాస్ ల కాంబినేషన్లో రూపొందనున్న ఆ కథ ఏవిటో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.147.211.117
Movie News (Latest)