ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో టైటిల్ ని పరిశీలిస్తోన్న కృష్ణవంశీ

Sat, Oct 03, 2015
కృష్ణవంశీ
కృష్ణవంశీ
కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక హారర్ సినిమా తెరకెక్కనుందనీ, దాని పేరు 'రుద్రాక్ష' అంటూ ఇటీవల ఒక వార్త షికారు చేసింది. దిల్ రాజు - ప్రకాష్ రాజ్ కలిసి నిర్మించనున్న ఈ సినిమాకి కృష్ణవంశీ ఈ పేరు పెట్టాలనుకోవడం నిజమేనటకానీ, ఈ పేరుతో ఆల్రెడీ ఒక సినిమా రూపొందనుందని తెలియడంతో, కృష్ణవంశీ మరో టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.

త్వరలోనే మంచి టైటిల్ ఫిక్స్ చేయాలనే ఉద్దేశంతో కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. నటీనటుల ఎంపిక పూర్తికాగానే, సెట్స్ పైకి వెళ్లేందుకు అవసరమైన సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం. ఇక 'రుద్రాక్ష' పేరుతో సినిమాను తెరకెక్కించనున్న దర్శకుడు ఎవరో కాదు, ఆది కథానాయకుడిగా 'రఫ్' సినిమా చేసిన సి హెచ్.సుబ్బారెడ్డి. వచ్చేనెలలో ఆయన ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)