ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భలే భలే మగాడిపై బాలీవుడ్ కన్ను!

Sat, Oct 03, 2015
నాని - లావణ్య త్రిపాఠి
నాని - లావణ్య త్రిపాఠి
ఈ మధ్య కాలంలో కథనీ .. కథనాన్ని నమ్ముకుని తెరపైకి వచ్చిన చిత్రంగా 'భలే భలే మగాడివోయ్' కనిపిస్తుంది. కథలో విషయం ఉండాలేగానీ, చిన్న సినిమాయే అయినా భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమని నిరూపించిన సినిమా ఇది. అలాంటి ఈ సినిమాపై బాలీవుడ్ కన్ను పడినట్టుగా తెలుస్తోంది. లిమిటెడ్ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా, అనేక రెట్ల లాభాలను తెచ్చిపెట్టింది.

ఇంతవరకూ ఈ సినిమా 27 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేయడంతో, యూత్ కి ఈ కంటెంట్ ఎంతగా కనెక్ట్ అయిందనేది బాలీవుడ్ నిర్మాతలకి అర్థమైపోయింది. దాంతో ఈ సినిమా హిందీ రైట్స్ ను సొంతం చేసుకోవడానికి పోటీపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా తరువాత అటు దర్శకుడు మారుతికి .. ఇటు నాని - లావణ్య త్రిపాఠిలకు కూడా ఆఫర్ల జోరు ఎక్కువగా ఉందనేది ఫిల్మ్ నగర్ టాక్.
X

Feedback Form

Your IP address: 54.163.173.253
Movie News (Latest)