ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తండ్రి చలవేనంటోన్న శ్రుతిహాసన్

Fri, Oct 02, 2015
శ్రుతిహాసన్
శ్రుతిహాసన్
తనపై తనకి నమ్మకాన్ని కలిగించినదీ .. తన ఎదుగుదలకి కారణమైనది తన తండ్రేనని చెబుతోంది శ్రుతిహాసన్. తన తాజా చిత్రం 'పులి' విడుదల సందర్భంగా మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని ప్రస్తావించింది. వ్యక్తిగతంగాను .. వృత్తి పరంగాను తనకి సంబంధించిన నిర్ణయాలను తానే తీసుకుంటానని ఆమె అంటోంది. కథలు వినడం .. తన కెరియర్ కి ఏ పాత్ర ఎంతవరకూ సాయపడుతుందో ఆలోచించుకుని తానే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెబుతోంది.

ఒక్కోసారి ఆశించిన ప్రయోజనాలు అందకపోయినా వాటిని గురించి చింతిస్తూ కూర్చోననీ, ఆ తరువాత ఏం చేయాలనే విషయాన్ని గురించి మాత్రమే స్థిరంగా ఆలోచిస్తానని అంటోంది. ఇక విజయమే ఎదురైతే దానిని తలచుకుంటూ పొంగిపోకుండా .. ఆ విజయం వలన వచ్చిన గుర్తింపును కాపాడుకునే దిశగా కృషి చేస్తానని చెబుతోంది. ఇలా తాను ఏది చేసినా .. దాని వెనుక తన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం .. ధైర్యం ఉంటాయంటూ, ఆయన పట్ల తనకి గల ప్రేమానురాగాలను వ్యక్తం చేసింది.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)